ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వాలి: రంజిత్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-30T00:38:10+05:30

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు.భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్ సభలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం ఈ విషయం పై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ రైతు ఫ్రెండ్లీ పరిపాలన చేస్తున్నారన్నారు. కేసిఆర్  దార్శనికత వల్ల సమృద్ధిగా నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు పంటల పెట్టుబడి కింద రైతు బంధు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు. 


ఈ కారణంగా ప్రతి ఏడాది రాష్ట్రంలో పంటలు అధికంగా పండుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఏడాది ఎఫ్.సి.ఐ కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని ఒకేసారి నిర్ణయించే విధంగా ఆదేశించాలని ప్రధానిని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. అలాగే, ప్రతి ఏటా పెరుగుతున్న దిగుబడులను అనుసరించి, ఎఫ్ సి. ఐ కొనుగోలు ను కూడా పెంచాలి. ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం సహకారంగా ఉండాలని, ఏవిధంగా ఎఫ్.సి.ఐ ని ఆదేశించాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధాని మోడీ ని కోరారు.

Updated Date - 2021-11-30T00:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising