ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్ 2న తేలిపోతుంది: ఎంపీ అరవింద్

ABN, First Publish Date - 2021-10-01T20:49:00+05:30

హుజురాబాద్ ఉప ఎన్నికలపై ప్రజలు ఎలాగు బుద్ధి చెప్తారని, నవంబర్ 2న తేలిపోతుందని ఏంపీ అరవింద్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: హుజురాబాద్ ఉప ఎన్నికలపై ప్రజలు ఎలాగు బుద్ధి చెప్తారని, నవంబర్ 2న తేలిపోతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్టు నిన్న నేను శ్రీశైలం బయలుదేరిన తర్వాత తెలిసిందన్నారు. మల్లన్న బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలోపేతమని, మల్లన్నకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ఆశాజీవని, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదని అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతిని విచ్ఛిన్నం చేసే వ్యక్తులను కూడా పార్టీలో చేర్చుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తండ్రి, కొడుకులిద్దరూ అబద్ధాలు ఆడడంలో మేధావులన్నారు. శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. హిందుత్వంపై పోరాడే వ్యక్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పుడు కేసులు పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు.

Updated Date - 2021-10-01T20:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising