ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నిరాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2021-04-08T16:48:27+05:30

నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం సాయంత్రం 6 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.


భారత్ దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో ఒక్క రోజులోనే లక్ష కేసులు దాటాయి. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.


దేశవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన సమయం. కోవిడ్-19 రోజు రోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలను ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,789. అంటే 24 గంటల్లో ఒక లక్ష కేసులు దాటడం ఇది మూడోసారి. మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత దేశం ఉంది.

Updated Date - 2021-04-08T16:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising