ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

good news : వచ్చే వారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-20T22:20:34+05:30

రోనా విజృంభణతో హైదరాబాద్ సిటీలో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా విజృంభణతో హైదరాబాద్ సిటీలో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం నుంచి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ  మేరకు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలోని దిగువ, మధ్యతరగతి ప్రజలకు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇతరులకు ఎంఎంటీఎస్‌తో ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ, తిరిగి సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రజలందరూ కరోనా నియమాలను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంఎంటీఎస్ సేవలను వాడుకోవాలని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎంఎంటీఎస్ సర్వీసుల పునరుద్ధరణకు అంగీకరించిన కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌కు మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ఈ ప్రకటన వెలువడింది.     

Updated Date - 2021-06-20T22:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising