ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ABN, First Publish Date - 2021-02-27T00:51:08+05:30

హైదరాబాద్: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన 53 బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. హైదరాబాద్‌లో బ్రహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 53 బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అర్చకులకు నెల నెలా గౌరవ వేతనం అందించే విషయం అలాగే రాష్ట్రంలోని 3645 దేవాలయాల్లో ధూప, దీప నైవేద్య కార్యక్రమాల కోసం ప్రతి ఏటా రూ.26 కోట్ల కేటాయించడంపై బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 


ప్రతిష్టాత్మకమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించడంతో పాటు, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంపై బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించగా, వాటిని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. పేద బ్రాహ్మణులకు సైతం ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గంగు ఉపెందర్ శర్మ, జనార్ధన్ మూర్తి, హనుమంతరావు, జగన్ మోహన్ శర్మ, పెన్న మోహన్ శర్మ, రజిత శర్మ, అనురాధ ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T00:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising