నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
ABN, First Publish Date - 2021-12-14T08:02:36+05:30
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
5 జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలు: సీఈవో
హైదరాబాద్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో చేపట్టే ఓట్ల లెక్కిపును ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో టెక్నికల్ ట్రైనింగ్ డెవల్‌పమెంట్ సెంటర్, నల్లగొండలో టీటీడీసీ (డీఆర్‌డీవో), మెదక్‌లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఖమ్మంలోని జిల్లా పంచాయత్ రీసోర్స్ సెంటర్ (డీపీఆర్‌సీ), కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఈవో వివరించారు. కాగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 10న పోలింగ్ నిర్వహించారు.
Updated Date - 2021-12-14T08:02:36+05:30 IST