ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక పాలనకు చరమగీతం పాడుదాం

ABN, First Publish Date - 2021-03-01T06:15:47+05:30

అరాచక పాలనకు చరమగీతం పాడుదాం

సమావేశంలో మాట్లాడుతున్న రాములు నాయక్‌, వేదికపై ముఖ్య నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌

ములుగుటౌన్‌, ఫిబ్రవరి 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనకు చరమగీతం పాడుదామని ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల కాం గ్రెస్‌  ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్‌ రాములు నాయక్‌ అన్నారు. ములుగులోని డీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అధ్యక్షత న ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఇంద్రశోభన్‌, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములు నాయక్‌ మాట్లాడుతూ ఆత్మగౌరవం, నీళ్ళు, నిఽధులు, నియామకాల సాధన కోసం కొనసాగిన తెలంగాణ పోరాటం కుటుంబ స్వార్థ రాజకీయాలకు పునాదిగా మా రిందన్నారు.  వేలాది మంది నిరుద్యోగుల ఆత్మబలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు గడీల పాలనలో బంధీ అయ్యిందన్నారు. ఒక గిరజన కుటుంబంలో పుట్టి ఎన్నో పోరాటాలు చేసిన, ఎమ్మెల్సీగా ఎదిగిన తాను కేసీఆర్‌ ఒంటెద్దు పోకడను భరించలేక లేకపోయానన్నారు. నిరంకుశుత్వాన్ని వి భేదించడం వల్లే సస్పెన్షన్‌కు గురయ్యానన్నారు.  తెలంగాణ ఉద్యమకారుడి గా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల గొం తుకనవుతానన్నారు. సీతక్క మాట్లాడుతూ రైళ్లలో చాయ్‌ అమ్మానని చెప్పిన మోదీ ప్రధాని అయిన తర్వాత అదే రైళ్లను ప్రైవేటుపరం చేస్తున్నారని వ్యా ఖ్యానించారు. ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు పారిశ్రామిక వేత్తలు కలి సి దేశాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్‌ ఉద్యోగులకు ప్రైవేట్‌ టీచర్లకు ఫీల్డు అసిస్టెంట్లకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. 


Updated Date - 2021-03-01T06:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising