ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలి

ABN, First Publish Date - 2021-07-25T06:22:50+05:30

నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు

కాటారం, జూలై 24: ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పి దం వల్ల వరదలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని మంథని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని దామెరకుంట, గంగపురి, గుండ్రాత్‌పల్లి గ్రామాల పరిధిలో పెద్దవాగు పోటెత్తడంతో వరద నీటిలో మునిగి పోయిన పత్తి పంట, వరి నారుమళ్లను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. రైతు లు, కౌలుదారులతో మాట్లాడి పంటల నష్టం వివరాలు తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజీ కట్టి పెద్ద వాగును డైవర్షన్‌ చేసినప్పటి నుంచి ప్రతి ఏటా ఇలాగే గోదావరి, మానేరు నదులు ఉధృతంగా ప్రవహించడం, పెద్ద వాగు నీరు కమ్మి పంటలు మునిగిపోవడం పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు చావే శరణ్యమన్నారు.  దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసి వరదలు రావడం ప్రకృ తి వైపరీత్యం కాగా వానాకాలంలోనూ బ్యారేజీల్లో నీటిని పెద్ద ఎత్తున నిల్వ చేయడం ప్రభుత్వ తప్పిదమేనన్నారు. వర్షాలు కురుస్తాయని తెలిసినా నీటిని కిందకి వదలకుండా ఎగువ నుంచి నీరు వచ్చేదాకా ఆగడంతోనే వాగు పోటెత్తిందన్నారు. ప్రభుత్వ సాంకేతిక వైఫల్యంతోనే పెద్దవాగు ప్రవాహాన్ని సరిగా అంచనా వేయలేకపోయారని, తద్వారా సుమారు 150 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న భూములను ప్రభుత్వం సేకరించి ప్రజలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.  వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఏడేళ్లుగా  ఒక్కసారి కూడా పంటల నష్టపరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ‘రైతుబంధు’ ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు.  కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇవ్వాలన్నారు. ఇలా వరదలతో పంటల నష్టం జరకుండా ప్రభుత్వం పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్‌ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, మహాముత్తారం జడ్పీటీసీ లింగమల్ల శారద, సర్పంచులు తెప్పల దేవేందర్‌రెడ్డి, అంగజాల అశోక్‌, బాసాని రఘువీర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోట రాజబాపు, నాయకులు చీమల సందీప్‌, తిరుపతి, సమ్మయ్య, శ్రీనివాస్‌, స్వామి, ప్రభాకర్‌, రాజీర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising