బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి
ABN, First Publish Date - 2021-02-02T20:35:08+05:30
బడుగు బలహీన వర్గాలపై తాను చేసిన వ్యాఖ్యలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ
హన్మకొండ: బడుగు బలహీన వర్గాలపై తాను చేసిన వ్యాఖ్యలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ చెప్పారు. హన్మకొండలోని అంబేడ్కర్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనసులైనా బాధ పడి ఉంటే క్షమించాలని కోరారు. కావాలని తాను ఎవరిని ఉద్ధేశించి మాట్లాడాలేదన్నారు.
కొన్నిరోజుల క్రితం హన్మకొండలో జరిగిన ఓసీ జేఏసీ సభలో ధర్మారెడ్డి మాట్లాడుతూ ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు మండిపడ్డాయి. అలాగే కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-02-02T20:35:08+05:30 IST