ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మస్ వేడుకల పై మంత్రుల సమావేశం

ABN, First Publish Date - 2021-12-16T01:21:56+05:30

క్రిస్మస్ వేడుకలు సవ్యంగా, పకడ్బందీగా, దిగ్విజయంగా జరిగేందుకు తగు చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలు సవ్యంగా, పకడ్బందీగా, దిగ్విజయంగా జరిగేందుకు తగు చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరయ్యే ప్రధానమైన వేడుకలు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయని, క్రిస్టియన్ సమాజానికి చెందిన 10వేల మందికి పైగా పాల్గొంటారన్నారు.నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎంసిహెచ్ఆర్డిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.


ఈ వేడుకలకు నగరానికి చెందిన 24మంది ఎమ్మెల్యేలకు 200 చొప్పున పాసులు అందజేయనున్నట్లు మంత్రులు తెలిపారు.ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, రంజాన్, బతుకమ్మ పండుగలతో పాటు క్రిస్మస్ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.ఇటువంటి గొప్ప సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభించారని,ఇలాంటి సంప్రదాయం దేశంలో మరెక్కడా లేదన్నారు.దీని వెనుక గొప్ప మానవీయ కోణం ఉందని నేతన్నలకు చేతినిండా పని కల్పించడం, పండుగ పూట పేదలు కొత్త బట్టలు ధరించామనే ఆత్మగౌరవాన్ని పెంపొందించడమని వివరించారు.


క్రిస్టియన్ పెద్దలు,ప్రముఖులకు ఆహ్వానాలను సకాలంలో అందజేయాలని, ముఖ్యమంత్రితో పాటు వేదికపై,డిన్నర్ టేబుల్ వద్ద కూర్చునే క్రిస్టియన్ ప్రముఖుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా సెలెబ్రేషన్ కమిటీ సభ్యులను మంత్రి ఈశ్వర్ కోరారు.ఆహ్వానాలు,దుస్తుల పంపిణీ పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిందిగా ఎమ్మెల్యేలను మంత్రులు కోరారు.వేడుకల ఏర్పాట్లు,ప్రముఖులను గుర్తించడం, స్వాగతించడం,నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు,లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్,వాణీదేవి, రాజేశ్వరరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,భేతి సుభాష్ రెడ్డి,ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, స్టీవెన్ సన్,నగర మేయర్ విజయలక్ష్మీ, సంబంధిత ఉన్నతాధికారులు నదీమ్ అహ్మద్, షానవాజ్ ఖాసీం,కాంతివెస్లీ, సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్, రాజీవ్ సాగర్, శంకర్ లూక్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T01:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising