ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధ బాలికల ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-08-19T19:48:13+05:30

అనాధలను కూడా అక్కున చేర్చకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అనాధలను కూడా అక్కున చేర్చకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాధలకు అండగా ఉండేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారని తెలిపారు. గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో కలిసి అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డా లో గల  అనాధ బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏమేం చర్యలు తీసుకుంటున్నారు,


అనాధ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసానికి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు  బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ వివరించారు.  

Updated Date - 2021-08-19T19:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising