ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహంకాళీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి

ABN, First Publish Date - 2021-12-06T23:56:57+05:30

సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పై సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మహేష్, కిషోర్, బాలాజీ శ్రీనివాస్ గౌడ్, కస్తూరి, ఆనంద్ పటేల్, చందు, కెఎం కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం ప్రభుత్వం, దాతలు, భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మొక్కుల రూపంలో భక్తులు చెల్లించిన బంగారంతో అమ్మవారికి బంగారు బోనం చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా అమ్మవారి గర్బగుడికి మిగిలి ఉన్న వెండి తాపడం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపునకు ఒక రధాన్ని చేయించాలని, అమ్మవారికి బంగారు చీరను చేయించాలని  సమావేశంలో నిర్ణయించారు. ఆలయ అభివృద్దికి ఇంకా చేపట్టాల్సిన పనులు, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చేయాల్సిన ఏర్పాట్లపై  సమావేశంలో చర్చించారు.

Updated Date - 2021-12-06T23:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising