ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక సంపద కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది: తలసాని

ABN, First Publish Date - 2021-08-22T21:29:19+05:30

చారిత్రక సంపద, పురాతనకట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని, వాటి పునరుద్ధరణకు కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రధాన్యతనిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చారిత్రక సంపద, పురాతనకట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని, వాటి పునరుద్ధరణకు కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రధాన్యతనిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సనత్ నగర్ నియోజక వర్గం బన్సీలాల్ పేట్ లోని నిజాం కాలం నాటి పురాతన మెట్లభావి పునరుద్ధరణ పనులను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం ఇక్కడి ప్రజలు ఈ భావిని అనేక రకాలుగా ఉపయోగించే వారని తెలిపారు. కాలక్రమేణా చెత్తాచెదారం వేయడం ద్వారా పూర్తిగా ముసుకు పోయి నిరుపయోగంగా మారిందని పేర్కొన్నారు. అయితే ఒక స్వచ్చంద సంస్థ, స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. 


ఈ బావి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి 15 శాతం పనులు కూడా పూర్తికాకముందే ఫలితాలు స్థానిక ప్రజలు చవిచూస్తున్నారని దానికి నిదర్శనం 30అడుగులకే నీళ్లు పడుతున్నాయని ఆయన వెల్లడించారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఈ బావిలో మంచినీరు ఎప్పుడు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భావితరాలకు చరిత్రను తెలియజేసే ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ శివానంద్,వాటర్ వర్క్స్ ఏఈ శశాంక్, స్వచ్చంద సంస్థ నిర్వాహకులు కల్పన రమేష్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-08-22T21:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising