ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి- తలసాని

ABN, First Publish Date - 2021-02-01T19:54:45+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి జరుగుతందని పశుసంవదర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొముల వెల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి జరుగుతందని పశుసంవదర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. సోమవారం కొమురవెల్లికి వచ్చిన తలసాని మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచే ్చ లక్షలాది భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. దాసారం గుట్టపై భక్తుల కోసం వసతి గృహాల నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు.


దేవాదాయ, ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ నిర్మిస్తామన్నారు. కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి 10కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఆలయ విస్తరణ, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఖర్చు చేస్తామని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు, తాను అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి తలసాని వెల్లడించారు. 

Updated Date - 2021-02-01T19:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising