ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగ పుత్రుల హక్కులకు భంగం కలగనివ్వం- తలసాని

ABN, First Publish Date - 2021-01-21T20:14:00+05:30

రాష్ట్రంలో గంగ పుత్రుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: రాష్ట్రంలో గంగ పుత్రుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండి గెస్ట్‌హౌస్‌లో బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య కారుల అభివృదిఽ్ధ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గంగపుత్రుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్‌ భగాయత్‌లో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్‌లను ఉత్తేజ పరిచే విధంగా మాత్రమే మాట్లాడానని అన్నారు. 


గంగ పుత్రులను బాధ పెట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఇప్పటకే ఈ విషయం పై గంగ పుత్ర సంఘం ప్రతినిధులతో జరిగిపిన సమావేశంలో వివరించినట్టు వెల్లడించారు. అత్యధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కుల వృత్తులకు చేయూతనందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తె లిపారు. 

Updated Date - 2021-01-21T20:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising