ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక కేంద్రంగా జోగులాంబ ఆలయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN, First Publish Date - 2021-04-16T22:08:01+05:30

గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయంతో పాటు, పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ  ఆలయంతో పాటు, పరిసర  ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర  క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పర్యాటక, హెరిటేజ్ తెలంగాణ శాఖల ప ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పర్యాటక, చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల అభివృద్ధి కి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం శ్రీ జోగులంబా అమ్మవారి ఆలయం తో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సుమారు 37 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. ఈమేరకు అలంపూర్ శాసన సభ్యుడు అబ్రహం  మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం కేసీఆర్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి దశలో సుమారు 20 కోట్ల రూపాయల తో చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన పనులను ప్రారంభించాలని డా. అబ్రహం మంత్రి ని కోరారు. మే నెల మొదటి వారంలో పనుల ను ప్రారంభిస్తామని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


దీనికి  అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి టూరిజం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టూరిజం ఎండి మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి, హెరిటేజ్ తెలంగాణ అధికారులు నారాయణ, బుద్ధవనం అధికారులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-16T22:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising