ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్మూలనకు సహకరిస్తాం

ABN, First Publish Date - 2021-12-13T22:57:35+05:30

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రొహిబిషన్,ఎక్సైజ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశం లో లాక్ డౌన్ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబబాద్, ములుగు, తోర్రుర్,మరిపెడ లాంటి ప్రదేశాల లలో గుడుంబా అమ్మకాలు సాగిస్తున్నారన్న విషయం పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్ములనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 


కాగా రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా లోని అచ్చం పేట, కొల్లపూర్ లలో అక్కడక్కడా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిని వెంటనే నిర్ములించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గంజాయిని అమ్మకాలు, రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ , బైండోవర్ కేసులను నమోదు చేయాలని అన్నారు. 


పోలీస్ , ఆబ్కారీ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను పేర్కొన్నారు.  సమావేశంలో నీరా పాలసి పనులను వేగవంతం చేసి వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-12-13T22:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising