ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇక్కడ పాదయాత్రనా?: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2021-08-28T21:48:14+05:30

కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో ఆపార్టీ అధ్యక్షుడు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌ నగర్‌: కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో ఆపార్టీ అధ్యక్షుడు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. ఆపార్టీ అధికారంలో లేని సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేసింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా రాష్ర్టానికి ఏమీ చేయడం లేదన్నారు.కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్‌ బిజె పి తీవ్రంగా స్పందంచారు. 


ఎల్‌ఐసీ, బిఎస్‌ ఎన్‌ ఎల్‌ అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తున్నామని చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారా?అంటూ ప్రశ్నించారు. బిజెపి నేతలు సీఎం కేసీఆర్‌ పై చేస్తున్న వ్యాఖ్యలు సరికావని అన్నారు. టీఆర్‌ఎస్‌ దృష్టి పేదల సేవ, రైంతాంగం సంక్షేమం పైనే ఉందని అన్నారు. కానీ బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని, ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని డజన్‌ మంది కేంద్ర మంత్రులు ప్రశంసిస్తే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఇక్కడ సమస్యలున్నాయంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పాద యాత్రలుచేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

Updated Date - 2021-08-28T21:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising