ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాకే పల్లెలు అభివృద్ధి- శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2021-01-16T20:49:44+05:30

తెలగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు పాడిపంటలతో, అభివృద్ధి పనులతో కళకళలాడుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు పాడిపంటలతో, అభివృద్ధి పనులతో కళకళలాడుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలుకల్పించడం వల్ల గ్రామీణ వ్యవస్ధ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. నగరంలోని మాదాపూర్‌లో ఉన్న శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలను మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్ధను, అన్ని రకాల కుల వృత్తులను, పండగలను విశిష్టతను , ప్రజల సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు శిల్పారామాలు ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయని తెలిపారు. 


మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఇప్పటికే ఉప్పల్‌భగాయత్‌లో ఏర్పాటు చేశామని, త్వరలో మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటుచేస్తామన్నారు. వీటితో పాటు రాష్ట్రంల సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలుచేస్తున్నట్టు తె లిపారు. హైదరాబాద్‌ లాంటి కాంక్రీట్‌ జంగిల్‌లో తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారని ప్రశంసించారు. 

Updated Date - 2021-01-16T20:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising