ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిషన్‌రెడ్డి.. ధాన్యంపై రాజకీయం మానుకోవాలి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-22T00:14:11+05:30

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో అన్ని అంశాలు చర్చించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో అన్ని అంశాలు చర్చించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన అంశాన్ని పదే పదే మంత్రికి వివరించామన్నారు. కొనుగోలు కేంద్రాలు ఉంచాలా ? లేదా అని కేంద్ర మంత్రిని అడిగామన్నారు. ఈ విషయంపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరామని అయితే రాతపూర్వక ఆదేశాలపై ఒకటి, రెండు రోజుల సమయం అడిగారన్నారు.అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకపోతే కొనుగోలు కేంద్రాలు కొనసాగించడం కష్టమన్నారు. రైల్వేరెక్స్ కేటాయించకపోవడంతోనే రబీ బియ్యం సప్లయి పూర్తి కాలేదని చెప్పారు.రెక్స్  లేని విషయాన్ని ముందుగానే లేఖలు రాశామని చెప్పారు.కిషన్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డి ధాన్యంపై రాజకీయం మానుకోవాలన్నారు. తెలంగాణపై ఆయనకు బాధ్యత లేదా?అని ప్రశ్నించారు. రైతులను కాపాడడానికి ఆరాట పడుతున్నామని రాత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-22T00:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising