ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాహారంలో తెలంగాణ నెంబర్ వన్ కావాలి: మంత్రి సత్యవతి రాధోడ్

ABN, First Publish Date - 2021-10-01T20:32:22+05:30

అన్ని రంగాలల్లో దేశానికి మోడల్ గా ఉన్న తెలంగాణ అంగన్వాడీలో కూడా ఆదర్శంగా మారాలని మాతా శిశు సంఓేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అన్ని రంగాలల్లో దేశానికి మోడల్ గా ఉన్న తెలంగాణ అంగన్వాడీలో కూడా ఆదర్శంగా మారాలని మాతా శిశు సంఓేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు.పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేసి బంగారు తెలంగాణ లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు.ఎంసిహెచ్ఆర్డిలో జరిగిన పోషణ్ మహ-2021 ముగింపు సమావేశంలో ఆమె పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోషకాహారలోపం నివారణే లక్ష్యంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ పనిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోషకాహార బోనమెత్తారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశించిన బంగారు తెలంగాణ సాధించడానికి రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని అన్నారు. 


పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడం కోసం చైతన్యం కల్పించేందుకు పోషణ మహ 2021 నిర్వహించినట్టు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహారంలో దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసి పనిచేయాలని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు.అంగన్వాడీలలో పనిచేస్తున్న మనం మొదట తల్లులం. మనం అధికారులుగా, ఉద్యోగులుగా కాకుండా బాధ్యతగా పని చేయడం ద్వారానే పోషకాహార లోపాన్ని నివారించగలమని మంత్రి పేర్కొన్నారు.


Updated Date - 2021-10-01T20:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising