ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సభ్యత్వ నమోదు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-03-04T05:24:05+05:30

సభ్యత్వ నమోదు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌ , మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మం త్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ పట్టణంలో బుధవారం టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్‌ శ్రేణులు క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకణుగుణంగా పార్టీ నేతలు సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం ఖాయం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమని మంత్రి సత్యవతిరాథోడ్‌ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లోని తన నివాసంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను పట్టభద్రులకు వివరించి ఓటు అభ్యర్థించాలని సూచించారు.   

కురవి : సక్రంనాయక్‌ తండా మాజీ ఎంపీటీసీ బానోత్‌ విజయ్‌ప్రకాష్‌ మృతి చెందడంతో మంత్రి సత్యవతిరాథోడ్‌  వారి కుటుంబాన్ని పరామర్శించారు. విజయ్‌ప్రకాష్‌ భార్య అచ్చమ్మ ప్రస్తుతం తండా సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు.

 

Updated Date - 2021-03-04T05:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising