ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటైజేషన్‌ పనులను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-08-31T00:56:47+05:30

త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య, శానిటైజేషన్ పనులను పూర్తి చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య, శానిటైజేషన్ పనులను పూర్తి చేయాలన్నారు. తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలను పునరుద్ధరించాలన్నారు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. సహకరించని వారి వివరాలను తమ పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులందరూ శానిటైజర్, మాస్క్‌లు పెట్టుకునేలా చూడాలన్నారు.


జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విద్యాలయాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌పోర్ట్ సమయంలోనే అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు. బస్‌లను ప్రతి రోజు శానిటైజేషన్ చేసేలా చూడాలన్నారు. పాఠశాలల వాతావరణానికి విద్యార్థులు అలవాటు పడేలా చూడాలని అధికారులను సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2021-08-31T00:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising