ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు సమస్య పరిష్కారం కేసీఆర్‌తోనే సాధ్యం: మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2021-10-31T21:03:31+05:30

రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో పోడు, అడవుల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ లోని జటిల సమస్యలను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. పోడు భూముల సమస్యలపై అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. అడవుల పునర్జీవనంపై అఖిలపక్షం సహకరించాలన్నారు.


పోడు సాగు చట్టాలపై ప్రజల్లో ప్రతిపక్షాలు అపోహలు సృష్టించవద్దన్నారు. 2005 చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 వరకు పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ సామావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలపక్ష నాయకులు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-31T21:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising