ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీ కెనాల్ ద్వారా 11 నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2021-07-06T23:03:35+05:30

ఎస్సారెస్పీ లక్ష్మీ కెనాల్ ద్వరా ఈ నెల 11 నుంచి నీటి విడుదలకు నీటిపారుదల సలహా బోర్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఎస్సారెస్పీ లక్ష్మీ కెనాల్ ద్వారా ఈ నెల 11 నుంచి నీటి విడుదలకు నీటిపారుదల సలహా బోర్డు అనుమతించిందని మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్‌లో  నీటిపారుదల సలహా బోర్డు సమవేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడతూ ఎస్సారెస్పీలో 29.22 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. రైతుల అవసరాలను బట్టి కాకతీయ కెనాల్ ద్వారా నీటిని వదిలేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


అలాగే లక్ష్మీ కెనాల్ ద్వరా 11 నుంచి నీటిని వదిలేందుకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ కాలువ ద్వారా చెరువులు నింపేందుకు కుడా నీటిని వాడుతామన్నారు. అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఈ నెల 11 నుంచి 6 విడతలుగా నవంబర్ వరకు 6.77 టీఎంసీల నీటిని విడుదల చేసే విధంగా బోర్డు నిర్ణయించిందన్నారు. గుత్ప ప్రాజెక్టు నుంచి ఆర్మూర్ నియోజక వర్గ రైతులకోసం 6 విడతలుగా నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 



నిజాంసాగర్ ప్రాజెక్టులో మొట్టమొదటిసారిగా గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా మంజీరా నీటిలో కలిపి సీఎం కేసీఆర్  చరిత్ర సృష్టించారని మంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిజాంసాగర్ నుంచి జూలైలో నీటిని విడుదల చేశారన్నారు. ఇందుకు రైతాంగ తరపున సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పోచారం ప్రాజెక్ట్ నుంచి ఆగస్టులో నీటిని విడుదల చేసేందుకు బోర్డు నిర్ణయించిందన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ లో పుష్కలంగా నీరు నిల్వ ఉందన్నారు.  జూలై నుంచి సెప్టెంబర్ వరకు రైతాంగానికి అవసరమయ్యే నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని ఆయకట్టు రైతంగానికి పుష్కలంగా నీరు అందిస్తామన్నారు. రైతులంతా సిరులు పండించాలని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ విట్టల్ రావు , ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-06T23:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising