ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయం లేకుండా భారత దేశం లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-12-08T22:24:13+05:30

వ్యవసాయం లేకుండా భారత దేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధర పై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వ్యవసాయం లేకుండా భారత దేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధర పై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపధ్యంలో గతంలోలాగా రాష్ట్ర వ్యవసాయ చట్టం, నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలని అన్నారు.మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, హాకా సంస్థలపై నిర్వహించిన సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డిపాల్గొన్నారు.వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ ఫీజు పకడ్భంధీగా వసూలు చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. 


అలాగే చెక్ పోస్టులన్నింటినీ బలోపేతం చేయాలన్నారు.రాబోయే కాలంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో మార్కెట్లలో వసతులు సమకూర్చాలని అధికారులకు సూచించారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలని,పప్పుగింజలు, నూనెగింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ కు సూచించారు. కొల్లాపూర్ లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్తూ జగిత్యాల మామిడి ముంబయికి వెళ్తుందని అన్నారు. ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు, ముఖ్యంగా డీఎపి, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు ప్రతి రోజూ తెప్పించుకుని మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే హాకాను పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T22:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising