ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-12-29T21:31:14+05:30

తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని, దీనికి రైతుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన వస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని, దీనికి రైతుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన వస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కన్నా ముందే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014-2015 లో 122 లక్షల ఎకరాలు ఉన్నసాగు 2020-21 కి 203 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.


2014-2015 లో 68.2 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020-21కి 259.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.సాగు నీటి వసతిని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-12-29T21:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising