ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతిని కాపాడుకుందాం:అది మనను కాపాడుతుంది: నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-08-23T21:07:03+05:30

ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మానవాళి ఆలోచనా తీరు మారాలని, ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న నర్సరీ మేళాకు మంత్రి హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు, మొక్కల పెంపకం మీద ప్రజల ఆలోచన తీరు క్రమంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం శాతం పెరిగింది.మ్యాన్ మేడ్ ఫారెస్టుల నిర్మాణంలో మనం ముందున్నామని, భావితరాలకు మనం అందించే గొప్ప సంపద ఇదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-23T21:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising