ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బంధుకు 63 లక్షల 25 వేల మంది అర్హులు: నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-06-14T00:56:11+05:30

ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధుల విడుదల నేపథ్యంలో ప్రస్తుతం ఈ పధకానికి 63.25 మంది రైతులు అర్హులుగా తేలారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధుల విడుదల నేపథ్యంలో ప్రస్తుతం ఈ పధకానికి 63 లక్షల 25 వేల 695 మంది రైతులు అర్హులుగా తేలారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఎల్ ఏ వ్యవసాయ శాఖకు తుదిజాబితా అందజేసిందని తెలిపారు. 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్లు అవసరమవుతాయని మంత్రి తెలిపారు. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది రైతులు పెరిగారు. అలాగే నూతనంగా 66 వేల 311 ఎకరాలు పెరిగాయని అన్నారు. మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని చెప్పారు.బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దు. ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. 


తెలంగాణలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులుగా తేలారు. మొత్తం 12.18 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.608.81 కోట్లు చెల్లించన్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 39,762 మంది రైతులు అర్హులు కాగా వారికి 77 వేల ఎకరాలకు రూ.38.39 కోట్లు చెల్లించనున్నమని తెలిపారు.రాష్ర్టంలోని ఏడు జిల్లాలకు రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు చెల్లించనున్నామని, అలాగే 11 జిల్లాలకు రూ.200 నుండి రూ.300 కోట్లు,10 జిల్లాలకు రూ.100 నుండి రూ.200 కోట్లు చెల్లించనున్నారు. వరంగల్ అర్బన్ , ములుగు, మేడ్చల్ జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు చెల్లించనున్నారు.ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-06-14T00:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising