ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్నిసహించేది లేదు: కేటీఆర్

ABN, First Publish Date - 2021-06-18T00:06:10+05:30

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది  విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్​ జోన్​ పరిధిలో కాంప్రెహెన్సివ్​ రోడ్​ మెయింటెనెన్స్​ ప్రొగ్రామ్​(సీఆర్​ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్​హోల్​ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్​ సెక్రెటరీ అర్వింద్​ కుమార్​ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మంత్రి  స్పష్టం చేశారు. 


మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్​ సెక్రెటరీ ఆర్వింద్​ కుమార్​ విచారణకు ఆదేశించారు. ఆ మేరకు అందుకు బాధ్యులైన  అసిస్టెంట్​ ఇంజినీర్​(ఏఈ)ఎం.రాజశేఖర్​, వర్క్​ ఇన్స్​పెక్టర్​ మహ్మద్​ యూసుఫ్​లపై సస్పెన్షన్​ వేటు పడింది.  వీరి పై అధికారులైన   ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​(బేగంపేట్​) ఆర్​.శివానంద్​, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​(బేగంపేట్​) టి.ఎస్​.ఆర్​.ఆంజనేయులులకు వివరణ ఇవ్వాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ మెమోలు జారీ చేశారు.  




ఇదిలాఉండగా,  పద్మారావునగర్​ మెయిన్​ రోడ్డును కాంప్రెహెన్సివ్​ రోడ్​ మెయింటెనెన్స్​ ప్రొగ్రామ్​(సీఆర్​ఎంపి)  బాధ్యతలు నిర్వహిస్తున్న మెసర్స్​ కె.ఎన్​.ఆర్​.కన్​స్ట్రక్షన్స్​కు జీహెచ్​ఎంసీ యంత్రాంగం  రూ.లక్ష పెనాల్టీ విధించింది.

Updated Date - 2021-06-18T00:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising