ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన కేటీఆర్

ABN, First Publish Date - 2021-11-03T01:23:15+05:30

హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్కసారి వచ్చిన విశ్రమ ఫలితంతో పార్టీకి నష్టం కలగదన్నారు. పార్టీపై ఎలాంటి ప్రభావం ఉందని చెప్పారు. ఒక్క ఓటమితో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్కసారి వచ్చిన మిశ్రమ ఫలితంతో పార్టీకి నష్టం కలగదన్నారు. పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఒక్క ఓటమితో కుంగి పోవాల్సిన అవసరం లేదని, 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో గెలుపోటములను చూసిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పోరాడారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 


కాగా హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 23, 855 ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 




Updated Date - 2021-11-03T01:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising