ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కారం ఇదేనా?.. బీజేపీ సోషల్ మీడియాపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-25T03:00:51+05:30

సోషల్ మీడియా సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీడియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సోషల్ మీడియా సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  వాక్ స్వాతంత్రం ఉందని.. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కొన్ని సమయాల్లో తాను ప్రజాజీవితంలో ఉండడం సరైనదేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. జర్నలిజం ముసుగులో అర్థం పర్థం లేని విషయాలు బయట పెట్టే చెత్త యూట్యూబ్ ఛానల్స్... పిల్లలను లాగడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ‘బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ నేతలకు నేర్పిన సంస్కారం ఇదేనా?.... రాజకీయాల్లోకి నా కుమారుడిని లాగడం సరైనదేనా’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 



Updated Date - 2021-12-25T03:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising