ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిజియో థెరపీ కోర్సుల శిక్షణలో శాంతిగిరి ఆశ్రమం భేష్

ABN, First Publish Date - 2021-08-20T01:46:51+05:30

పురాతన కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చిన పంచకర్మ ఫిజియా థెరపీ కోర్సులో శిక్షణ ఇవ్వడంలో కేరళకు చెందిన శాంతిగిరి ఆశ్రమం ముందు ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పురాతన కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చిన పంచకర్మ ఫిజియా థెరపీ కోర్సులో శిక్షణ ఇవ్వడంలో కేరళకు చెందిన శాంతిగిరి ఆశ్రమం ముందు ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాబార్డ్ సహకారంతో ఈ కోర్సులో శిక్షణ ఇచ్చిన వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ఆయన ఆశ్రమం నిర్వాహకులను అభినందించారు. ఈ సంవత్సరం సంస్థ సౌజన్యంతో నాబార్డ్ సహకారంతో శిక్షణ పొందిన 25 మందిలో 13 మంది సూర్యపేట కు చెందిన వారే ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 


శిక్షణ పొందిన 25 మందికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోని శాంతిగిరి ఆశ్రమం విభాగాలలో ఉద్యోగ అవకాశాలు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నాబార్డ్ సహకారంతో శాంతిగిరి ఆశ్రమం సౌజన్యం తో ఆయుర్వేద పంచకర్మ థెరపీ కోర్సులో శిక్షణ పొందిన 25 మందికి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియమకపు పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాబార్డ్ డెవలప్మెంట్ మేనేజర్ యస్. ప్రవీణ్ కుమార్,శాంతిగిరి ఆశ్రమం తెలుగు రాష్ట్రాల ఇన్ చార్జి యస్ ప్రమోద్ కుమార్, దిశ ఫౌండేషన్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T01:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising