ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలకు పరిహారం అందేలా చూస్తాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-07-24T20:06:22+05:30

వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా స‌హాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మ‌ల్: వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా స‌హాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద నీటిలో మునిగి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. శ‌నివారం పీచ‌ర‌, ధ‌ర్మారం, చింతల్ చాంద‌ గ్రామాల్లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌టించి, పంట‌ల‌ను, చేప‌ల చెరువును ప‌రిశీలించారు. ఏ మేర‌కు  పంట న‌ష్టం వాటిల్లింద‌ని రైతుల‌ను,  అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారీ వ‌ర్షాల‌ వల్ల వరద ఉధృతితో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయన్నారు. వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా స‌హాయం అందించేందుకు  రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంద‌ని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-07-24T20:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising