ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ABN, First Publish Date - 2021-12-29T20:30:57+05:30

యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖ‌తాల్లో జ‌మా అవుతుండ‌టంతో అన్న‌దాత‌లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మ‌ల్: యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖ‌తాల్లో జ‌మా అవుతుండ‌టంతో అన్న‌దాత‌లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేసినందుకు ముధోల్ నియోజ‌క‌వ‌ర్గం లోకేశ్వ‌రం మండ‌లం పుస్పూర్ర్ గ్రామంలోరైతుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు.అనంతరం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు.అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు.  


దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్నతెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T20:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising