ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం- మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-21T19:52:26+05:30

ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని ప్ర‌తి ఒక్క‌రూ గ్రహించాల్సిన అవ‌స‌రం ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని ప్ర‌తి ఒక్క‌రూ గ్రహించాల్సిన అవ‌స‌రం ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయ అట‌వీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునః నిర్వచించటానికి ఇదే స‌రైన సమయం అని అన్నారు. లేక‌పోతే భ‌విష్య‌త్తులో  గాలి, నీరు దొర‌క‌ని ప‌రిస్థుతుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు.


మనల్ని మనం ర‌క్షించుకోవడానికిగాను, మనం భూగ్రహాన్ని రక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాల‌ని పేర్కొన్నారు. భూమిపై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త సాధ్య‌మ‌వుతుంద‌ని, అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధన్య‌త‌నిస్తుంద‌న్నారు. ప్రతి ఒక్క‌రూ తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలవాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-03-21T19:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising