ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలకు ఉన్నత పదవులు ఇచ్చాం

ABN, First Publish Date - 2021-10-27T08:27:06+05:30

ఈటల రాజేందర్‌కు ఉన్నత పదవులు ఇచ్చి, ఆయన ఆత్మగౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఓటమి భయంతో సెంటిమెంట్‌ రగిలించేందుకు దాడులు, కుట్రలు, డ్రామాలకు తెరలేపుతున్న బీజేపీని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆయన ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆరే
  • దాడులకు బీజేపీ కుట్ర: మంత్రి హరీశ్‌రావు
  • దేశానికే ఆదర్శంగా మన పథకాలు: శ్రీనివాస్‌గౌడ్‌ 


ఇల్లందకుంట, అక్టోబరు 26 : ఈటల రాజేందర్‌కు ఉన్నత పదవులు ఇచ్చి, ఆయన ఆత్మగౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఓటమి భయంతో సెంటిమెంట్‌ రగిలించేందుకు దాడులు, కుట్రలు, డ్రామాలకు తెరలేపుతున్న బీజేపీని బొందపెట్టాలని కోరారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరణ్‌ ఛుగ్‌ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో (ఇంటింటికీ మంచినీరు) జోక్‌లా ఉందన్నారు. నాలుగేళ్ల కిందనే తాము ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు ఇచ్చామని గుర్తు చేశారు. పేద దళితులతో దళిత బంధు ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో అన్ని కులాల్లోని పేదలకు పథకం వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. బడా వ్యాపారులకు పెద్దపీట వేసే ఆ పార్టీని బొంద పెట్టాలన్నారు.


మంత్రిగా ఉన్నా అభివృద్ధి చేయలేని ఈటల, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివా్‌సను గెలిపిస్తే నియోజకవర్గంలో ఐదు వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. కులాల పేరు మీద బీజేపీ ఓట్లు లాగే ప్రయత్నం చేస్తోందని, అలాంటి పార్టీకి హుజూరాబాద్‌లో స్థానం కల్పించవద్దని ప్రజలను కోరారు. 

Updated Date - 2021-10-27T08:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising