ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకానే కరోనాకు ఆయుధం: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-04-13T20:10:52+05:30

టీకానే కరోనాకు ఆయుధమని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీపంచి ఆడిటోరియంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: టీకానే కరోనాకు ఆయుధమని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీపంచి ఆడిటోరియంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు  పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ పాల్గొన్నారు.  పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. పేద ఆడబిడ్డలకు రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. పేదలు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ కళ అని చెప్పారు. మరో వెయ్యి ఇళ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామని మంత్రి హరీష్‌రావు  ప్రకటించారు.


రెండున్నర కోట్లతో నిర్మించిన డయాగ్నస్టిక్ హబ్, రెండు కోట్ల 20లక్షలతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే పేదలు వైద్య సహాయం పొందాలని తెలిపారు. మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని సూచించారు. 45 ఏళ్లు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తెలంగాణలో రెండువేల పెన్షన్ ఇస్తున్నాం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 500మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T20:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising