ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు నాణ్యమైన వైద్యం: హరీశ్ రావు

ABN, First Publish Date - 2021-12-23T22:23:26+05:30

రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే తమ ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. నగరంలోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో  ఐసీయూ భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్‌ని హరీష్ రావు ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్  గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనన్నారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారన్నారు. ఆమె ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీకుంటున్నామన్నారు. ఇంకా తొందరగా విడుదల అయ్యేటట్టు చూస్తున్నామన్నారు.


6 నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు.  ఆసుపత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి  అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-23T22:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising