ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ తరహాలో సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్

ABN, First Publish Date - 2021-04-09T23:51:25+05:30

దేశంలోని కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల తరహాలో సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్ ఉందని ఆర్థికశాఖా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దేశంలోని కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల తరహాలో సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్ ఉందని ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 154 కోట్ల 43 లక్షలు బడ్జెట్‌కు సిద్దిపేట మున్సిపాలిటీ అమోదం తెలిపింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 425 పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచినందుకు పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పాటు అయినప్పటి నుంచి మున్సిపల్ ఆధ్యర్యంలో పట్టణంలో 529కోట్ల 35లక్షల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి తెలిపారు. పట్టణంలో చెత్త సేకరణకు కౌన్సిల్‌లోని అందరూ ఆదర్శంగా పనిచేశారని మంత్రి మెచ్చుకున్నారు.


 ఒక్కప్పుడు సిద్దిపేట అంటే పందులకు ప్రసిద్ది అని, కానీ ఇప్పుడు అభివృద్ధికి, అవార్డ్‌లకు ప్రసిద్దిగా మారుపేరు సాధించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 10న పట్టణంలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందు చూపుతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. స్లాటర్ హౌస్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 


Updated Date - 2021-04-09T23:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising