ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు తలమానికంగా మల్లన్న సాగర్ : హరీశ్ రావు

ABN, First Publish Date - 2021-11-05T21:30:00+05:30

మల్లన్న సాగర్ వల్ల తెలంగాణలోని పలు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: మల్లన్న సాగర్ వల్ల తెలంగాణలోని పలు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిపోతుందన్నారు. మల్లన్నసాగర్ వల్ల  రైతుల తలరాతలు మారతాయని, ఇది తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం సందర్శించారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్ తో అనతి కాలంలోనే గొప్ప అద్భుతం మన కళ్లముందు ఆవిష్కృతమైందని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమయిందన్నారు.మల్లన్నసాగర్‌లోకి ప్రస్తుతం 11 టీఎంసీ నీరు వచ్చిందని, అవి 30 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని, బండ్ మొత్తం 22 కిలోమీటర్లు ఉండగా దాదాపు 20 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయన్నారు. ఇది ఎప్పటికీ నిలిచిపోయే గొప్పపని అని, అనతి కాలంలోనే దీనిని పూర్తి చేసుకున్నామని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2021-11-05T21:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising