ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మనుమడి ర్యాగింగ్‌

ABN, First Publish Date - 2021-03-08T08:23:24+05:30

రాష్ట్ర సీనియర్‌ మంత్రి మనుమడిపై ర్యాగింగ్‌ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3లో ఉన్న ముఫకంజా ఇంజనీరింగ్‌ కాలేజీలో మంత్రి మనమడు చదువుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తమను కొట్టాడని పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు
  • అయినా కేసు నమోదు చేయలేదు
  • ఎలాంటి ఫిర్యాదూ రాలేదు: పోలీసులు

పంజాగుట్ట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సీనియర్‌ మంత్రి మనుమడిపై ర్యాగింగ్‌ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3లో ఉన్న ముఫకంజా ఇంజనీరింగ్‌ కాలేజీలో మంత్రి మనమడు చదువుతున్నాడు. కళాశాలలో ఆ యువకుడు తమపై దాడి చేశాడని పంజాగుట్ట పోలీసులకు కొంత మంది విద్యార్థులు శనివారం ఫిర్యాదు చేశారు. అతడి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశామని బాధిత యువకులు పేర్కొన్నారు. తాను మంత్రి మనుమడిని అని బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేయని పంజాగుట్ట పోలీసులు.. జనరల్‌ డైరీలో మాత్రమే ఫిర్యాదు రాసి బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పంజాగుట్ట పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం శనివారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు కూడా తెలిసింది. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే సమాచారం అందడంతో పోలీసులు ఆ కళాశాలకు వెళ్లారు. ఈ విషయమై పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్‌, పంజాగుట్ట పోలీసు అధికారులను అడిగేతే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.

Updated Date - 2021-03-08T08:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising