టీఆర్‌ఎ్‌సను వీడినవాళ్లంతా హీనులుగా మారారు మంత్రి గంగుల కమలాకర్
ABN, First Publish Date - 2021-02-13T08:51:22+05:30
కొంత మంది ఓపిక లేక ముందే కోయిల కూసినట్లుగా టీఆర్‌ఎ్‌సను వీడి హీనులుగా మారారని, పార్టీని వీడినవాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 12: కొంత మంది ఓపిక లేక ముందే కోయిల కూసినట్లుగా టీఆర్‌ఎ్‌సను వీడి హీనులుగా మారారని, పార్టీని వీడినవాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్ అవసరమని, టీఆర్ ఎస్‌కు కేసీఆర్ నాయకత్వం అవసరమని చెప్పారు. మెజారిటీ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదుపై ఏర్పాటు చేసిన జిల్లా విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇతర పార్టీల నేతలు ఏవేవో విమర్శలు చేస్తున్నారు. మాకు చేతకాక కాదు.. మా మంచితనాన్ని అసమర్థతగా భావించొద్దు. అధికారంలో ఉన్న మేము మీలాగా మాట్లాడలేము. మాకు హద్దులు ఉంటాయి. ఒకవేళ మేము మాట్లాడితే భయంకరంగా ఉంటుంది’ అని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, సహనంతో పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు, తగిన ప్రాధాన్యం లభిస్తుందని ఆయన అన్నారు.
Updated Date - 2021-02-13T08:51:22+05:30 IST