ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఏనాడు గ్రామాల అభివృద్ధి ఈస్థాయిలో జరగలేదు-ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-03-24T20:16:13+05:30

గతంలో ఏనాడూ గ్రామాల్లో ఈస్థాయి అభివృద్ధి జరగలేదని పంచాయితరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావుపేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గతంలో ఏనాడూ గ్రామాల్లో ఈస్థాయి అభివృద్ధి జరగలేదని పంచాయితరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావుపేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనా, కొత్తపధకాలు రూపు దిద్దుకుని గ్రామాలకు మహర్ధశ పట్టిందన్నారు. తెలంగాణ శాసన సభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మనిషి చే స్తే ఎక్కడ పెట్టాలో తెలియని ఆయోమయం ఉండేంది. కానీ నేడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక స్మశాన వాటిక ఏర్పాటవుతోందనారు.


సీఎం కేసీఆర్‌ చొరవ వల్ల ప్రతి గ్రామంలో నర్సరీ, డంపుయార్డ్‌,పల్లె ప్రగతివనం,  స్మశాన వాటికలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. నిజంగా ప్రజల వద్దకు పాలన తెచ్చింది కేసీఆర్‌ అని ఆయన వెల్లడించారు. అసలైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన సిసలైన తెలంగాణగాంధీ కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 8వేల 690 గ్రామ పంచాయితీలుంటే వాటి సంఖ్యను 12వేల 751కి పెంచినట్టుతెలిపారు అంటే కొత్తగా 4వేల 61 గ్రామ పంచాయితీలు ఏర్పడ్డాయన్నారు. తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటుచేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. ఆదివాసీలు,గిరిజనుల గూడాలు,తండాల్లో వారి పరిపాలన ఉండే విధంగా 3వేల 146 తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేననిఅన్నారు. ఈ చర్యలతో గిరిజనులు సర్పంచ్‌లు అయ్యారన్నారు. 

Updated Date - 2021-03-24T20:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising