ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-12-06T22:30:08+05:30

జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల  ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. తూర్పార పడుతున్న ధాన్యం పరిస్థితిని పరిశీలించారు. పలువురు రైతులతో ముచ్చటించారు. ఎంత పొలం చేసినవు? ఎంత పండింది? గిట్టుబాటు ఉందా? అంటూ అరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా, వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రైతులు ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, తేమ, తాలు లేకుండా జగృత్త పడితే, మంచి ధర వస్తుంది అని చెప్పారు.


వ్యవసాయంలో పంటల మార్పిడి సహజమేనని, అయితే లాభదాయక పంటలు వేసుకోవాలని మంత్రి చెప్పారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, కోతుల బెడద నుండి రక్షించాలని రైతులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు.అందుకు మంత్రి సమాధానమిస్తూ, కోతుల సమస్యను పరిష్కరించడానికి సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.అయితే, నీరు సమృద్ధిగా ఉందని, ఆ నీటి సరఫరాను నిలిపి వేయాలని ఇక రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు మంత్రి వారికి నీరు కేవలం పంటల కోసమేనని అనుకోవద్దన్నారు.మంచినీరు ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఆధారం అన్నారు. 


సీఎం కేసీఆర్ సమృద్ధిగా నీటిని ఇస్తూ, రైతులకు రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు చేపట్టి మేలు చేస్తూ, చివరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, చివరకు ధాన్యం, బియ్యం కొనబోమని మొండి కేసిందని రైతులకు చెప్పారు. ఈ స్థితిలో కేసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అన్నారు. తాను కూడా తన పొలాన్ని చెలకగా మార్చి, ఆయిల్ పామ్ వేశానని చెప్పారు. తొర్రూరు లో ఆయిల్ పామ్ పరిశ్రమను స్థాపింప చేస్తున్నామని, ఎకరాకు లక్ష రూపాయల సంపాదన సాధ్యమన్నారు. ఆయిల్ పామ్ సాగు మధ్య అంతరంగా, ఇతర పంటలు కూడా వేసుకోవచ్చని మంత్రి రైతులకు చైతన్యం కలిగించారు.అందుకే రైతులు ఈ యాసంగి లో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.

Updated Date - 2021-12-06T22:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising