ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడ‌ల్ సెంట్ర‌ల్ జైల్ నిర్మాణానికి మామునూర్‌లో 101 ఎక‌రాల భూమి

ABN, First Publish Date - 2021-06-21T01:00:44+05:30

నగరంలోని మామునూర్ లో ఉన్న తెలంగాణా స్టేట్ స్పెషల్ పోలీస్ 4 వ బెటాలియన్ ఆవరణలో మోడల్ సెంట్రల్ జైలు నిర్మాణానికి 101 ఎకరాల భూమిని కేటాయిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నగరంలోని మామునూర్ లో ఉన్న తెలంగాణా స్టేట్ స్పెషల్ పోలీస్ 4 వ బెటాలియన్ ఆవరణలో మోడల్ సెంట్రల్ జైలు నిర్మాణానికి  101 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హోమ్‌(లీగల్) డిపార్టుమెంటు, జి.ఓ యం.యస్ నెం 63 తేది: 19.06.2021 ప్రకారం టి.పి.యస్.పి 4 వ బెటాలియన్ ఆవరణలో 101 ఎకరాలు కేంద్ర కారాగారానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఆయన తెలిపారు.


మామునూర్ స్టేట్ స్పెషల్ పోలీస్ 4 వ బెటాలియన్ ప్రాంగణంలో మోడల్ సెంట్రల్ జైలుకు 101 ఎకరాలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఉమ్మడి జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-06-21T01:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising