పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సమస్యలు..
ABN, First Publish Date - 2021-07-11T08:55:12+05:30
పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సం బంధ సమస్యల పరిష్కారం ప్రధా న ఎజెండాలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. జూలై 1 నుంచి
ముగిసిన 10 రోజుల పల్లె, పట్టణ ప్రగతి.. విజయవంతంగా నిర్వహించాం:ఎర్రబెల్లి
హైదరాబాద్,జూలై 10(ఆంధ్రజ్యోతి): పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సం బంధ సమస్యల పరిష్కారం ప్రధా న ఎజెండాలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. జూలై 1 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంది త శాఖల అధికారులు ఈ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి విజయవంతమైనట్లు సంబంధిత శాఖలు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైనదని పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
10 రోజుల పల్లె ప్రగతి
6,56,295 కిలోమీటర్ల రహదారులు శుభ్రం. 3,51,363 మురుగు కాలువల్లో పూడిక తీత. 1,58,251 ప్రభుత్వ సంస్థల్లో పరిశుభ్రత కార్యక్రమాలు. 50,261 లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా చదును. 12,720 వైకుంఠధామాలు, 12,776 డంపింగ్ యార్డులకు బయో ఫెన్సింగ్. ఇంటింటికీ ఆరు మొక్కల వంతున 78398578 మొక్కల పం పిణీ. 16107043 మీటర్ల మేర రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు.
10 రోజుల పట్టణ ప్రగతి
31061 టన్నుల వ్యర్థాల ఎత్తివేత. 166260 టన్నుల శిథిలాల వ్యర్థాల తొలగింపు. 13246 కిలోమీటర్ల మేర కాలువల్లో పూడిక తీత. 5520 ప్రాంతాల్లో గుంతలు పూడ్చి నీరు ని లు వ ఉండకుండా చదును. 15117 ప్రాంతాల్లో ఫాగింగ్. 2096 నీటి ట్యాంకులు శుభ్రం. 1312 పార్కులు శుభ్రం వంటి పనులు చేశారు.
Updated Date - 2021-07-11T08:55:12+05:30 IST