ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ ల పిచ్చి ప్రేలాపనలు

ABN, First Publish Date - 2021-11-24T21:11:53+05:30

వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆ రెండు పార్టీల నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నరని అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి హన్మకొండలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 


దేశంలో ఏ రాష్ట్రంలో నైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా?అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొంటోందన్నారు.టీపీ సీసీ అధినేత రేవంత్ రెడ్డి ఫకీరు వేషాలు మానుకోవాలన్నారు. తొండి సంజయ్ మాటలకు విలువ లేదన్నారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నామని, సీఎం కేసీఆర్ కి కేంద్ర నాయకులు కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులు ధాన్యం కొనుగోలుపై స్పష్టతను ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత‌కైనా సిద్దంగా ఉందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.  


తెలంగాణ ప‌ట్ల కేంద్రం ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజేపి తెలంగాణ హ‌క్కుల‌ను కాల‌రాస్తుందన్నారు. రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్న పార్టీలు డిల్లీలో త‌మ స‌త్తా చాటాలని డిమాండ్ చేశారు. రాజ‌కీయాల కోసం ఇక్క‌డ తిరుగ‌డం కాదు.. డిల్లీ మెడ‌లు వంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలని ఆయన కోరారు. తెలంగాణ‌లో రైతులు వానాకాలంలో పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను కొనుగోలు చేస్తామని, రైతులు సంయమ‌నం పాటించాలని అన్నారు.

Updated Date - 2021-11-24T21:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising