ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాలి

ABN, First Publish Date - 2021-11-10T22:55:12+05:30

తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, సీఎం కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశానుసారం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, సీఎం కేసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశానుసారం, శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కోవిడ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు, ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ కేంద్రం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని మంత్రి కోరారు.శుక్రవారం రోజు ఉదయం పదిగంటల నుండి మద్నాహ్నం ఒంటి గంట వరకూ రైతులతో కలిసి ఆయా ప్రాంతాల్లో రైతు దర్నాలు చేయాలని శ్రేణులకు, రైతులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా, సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బాగు చేస్తూ, బంగారు తెలంగాణ చేస్తున్నారని తెలిపారు. 


ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన కేంద్రం, ఇప్పుడు తెలంగాణ రైతుల పంటలను కొనబోమని, రాష్ట్రం కొనకూడదని అదేశించిందన్నరు. ఈ నిరంకుశ అన్యాయ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా దర్నాలు చేసే పరిస్థితిని కల్పించిన కేంద్ర అసమర్థ విధానాల్ని మంత్రి ఎండగట్టారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకరకంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, రాష్ట్రం ఏం చెబుతుందో కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ తప్పుపడుతున్నారని ఈ గందరగోళం తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే రైతు దర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల పంట కేంద్రం కొనడం భిక్ష కాదని, అది రాష్ట్రాల ప్రజాస్వామ్యబద్దమైన రైతుల హక్కని అన్నారు. గతంలో లేవీ విదానం ఉన్నప్పుడు కేంద్రమే వరి పండించండి అని ప్రోత్సహించిందని తద్వారా వరి పంట సాగు క్రమంగా అలవాటైందన్నారు. 

Updated Date - 2021-11-10T22:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising