ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతే రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-11-06T20:23:58+05:30

తెలంగాణలో ప్రతి రైతు కూడా రాజే కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: తెలంగాణలో ప్రతి రైతు కూడా రాజే కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రైతుల అభ్యున్నతికి అనేక పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంస్థ (ఎఫ్ ఎస్ సి ఎస్) ఆధ్వర్యంలో, అలాగే పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతోనే తెలంగాణాలో పుష్కలంగా నీరు అందుతోందన్నారు.దీంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు.


రైతులకు రైతు బంధు, రైతు బీమా,  సాగు నీరు, 24గంటల పాటు ఉచిత, నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.రైతుల కోసం రైతు వేదికలు, కల్లాలు కట్టించినంరైతులు ఆత్మ గౌరవంతో, ఆత్మహత్యలకు తావు లేని విధంగా సీఎం కేసీఆర్ మొత్తం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుల పంటలను ఆఖరు గింజ వరకు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.టోకెన్ పద్దతిలో ధాన్యం కొనుగోలును నిర్వహించాలి.


రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, మన రాష్ట్ర వైఖరికి భిన్నంగా కేంద్రం పద్ధతి ఉందని మంత్రి విమర్శించారు.రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన కేంద్రం, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేస్తోందన్నారు.బీజేపీ నేతలకు దమ్ము ఉంటే, కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించాలని సవాల్ విసిరారు. బిజెపి నేత బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య, డిఎస్ఓ రోజా రమణి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి రాధిక, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T20:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising